Posts

Showing posts with the label telugu kathalu new

నమ్మకమే.. స్నేహం! | Moral Stories | Telugu Stories @multiplewaystogrow

Image
  నమ్మకమే.. స్నేహం!  బదరిక వనంలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. దాని నీడలోనే ఓ నీటి కొలను కూడా ఉంది. ఆ చెట్టు మీద బదరీ అనే కొంగ తన బుజ్జి కొంగతో నివసిస్తోంది. అవి కొలనులో దొరికే చేపలు తింటూ హాయిగా జీవిస్తున్నాయి. బుజ్జి కొంగకు రెక్కలు వచ్చిన తర్వాత కొలను దగ్గరకు వెళ్లి నీటిని, అందులో అటూ ఇటూ గెంతుతున్న చేపను చూస్తూ.. ఎంచక్కా ఆడుకోసాగింది. ఇంతలో అక్కడికి తల్లి కొంగ వచ్చింది. బుజ్జి కొంగ కేరింతలు చూసి.. 'అలా చేప పిల్ల గాలిలోకి ఎగురుతుంటే.. చక్కగా నోటితో పట్టుకుని ఆరగించాలి గాని అలా చూస్తూ కేరింతలు కొడుతున్నావెందుకు?' అని అడిగింది. 'అమ్మా! ఆ చేప పిల్ల నీటిలో నుంచి గాలిలోకి ఎంత ఆనందంగా గంతులు వేస్తుందో.. ఆ చేపపిల్లతో నాకు స్నేహం చేయాలని అనిపిస్తోంది. కానీ.. దాన్ని తినాలనిపించడంలేదు' అంది. 'చేపలు మన ఆహారం. వాటితో నీకు స్నేహం ఏంటి?' అంటూ అక్కడి నుంచి చెట్టు మీదకు ఎగిరిపోయింది తల్లి కొంగ. ఈ మాటలన్నీ.. కొలనులో ఉన్న చేపపిల్ల విన్నది. దాంతో అది భయపడి ఇక గాల్లోకి గెంతడం ఆపేసింది. బుజ్జి కొంగ ఏమో.. ఒడ్డున నిలబడి ఆ చేపపిల్ల ఎప్పుడు ఎగురుతుందా అని ఎదురు చూస్తోంది. ఎంతసేపైనా అది ప...

ఊరు - అడవి ( విక్రమార్కుడు - బేతాళుడు - 1) | Moral Stories | Telugu Kathalu @multiplewaystogrow

Image
  ఊరు - అడవి ( విక్రమార్కుడు - బేతాళుడు - 1) | Moral Stories | Telugu Kathalu @multiplewaystogrow ఊరు -అడవి గోదావరీ తీరాన ప్రతిష్ఠాన రాజ్యానికి రాజు విక్రమార్కుడు. ఒకనాడతడి ఆస్థానానికి క్షాంతిశీలుడనే భిక్షువొకడు వచ్చి రాజుకి పండొకటి కానుకగా ఇచ్చాడు. రాజు ఆ పండుని పక్కనున్న ఓ కోతిపిల్లకి ఇచ్చాడు. కోతి పండు కొరికేసరికి అందులోంచి మేలిరత్నం ఒకటి బయటపడింది. రాజు ఆశ్చర్యపడి, ‘‘నానుండి నీకేం సాయం కావాలి?’’ అని భిక్షువునడిగాడు. ‘‘రాజా! నేను మంత్రసాధన చేస్తున్నాను. అది పరిపూర్ణం కావడానికి నీఅంత మహావీరుడి సాయం కావాలి. వచ్చే కృష్ణచతుర్దశినాటిరాత్రి ఈ ఊరి శ్మశానంలో ఉన్న మర్రిచెట్టు వద్దకు వస్తే ఆ సాయమేమిటో చెబుతాను’’ అన్నాడు భిక్షువు.రాజు సరేనని భిక్షువుని పంపేశాడు. తర్వాత అతడు కోరినట్లే కృష్ణచతుర్దశినాటిరాత్రి విక్రమార్కుడు నల్లటి బట్టలు ధరించి, కత్తి చేత ధరించి, శ్మశానానికి వెళ్లి అక్కడ మర్రిచెట్టుకింద ఉన్న భిక్షువు దగ్గరకు చేరుకున్నాడు. భిక్షువు అతడితో, ‘‘రాజా! దక్షిణంగా వెడితే అక్కడ ఒకే ఒక ఇరుగుడుచెట్టు కనిపిస్తుంది. దానిపై ఉరితీయబడిన పురుషుడి శవం కనిపిస్తుంది. నీవా శవాన్ని చెట్టునుంచి ది...

నా పాట.. నీ నాట్యం! (కథ) | Telugu Stories | Moral Stories @multiplewaystogrow

Image
  *నా పాట.. నీ నాట్యం!* (కథ)  *నెమలి* కి అంతా అయోమయంగా ఉంది.  తాను అడవిలోకి వచ్చానని మాత్రం తెలుసుకుంది.  'పగలే అయినా వెలుగు తక్కువగా ఉండటానికి కారణం ఏపుగా పెరిగిన చెట్లే కదా' అని అనుకుంది.  నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ కొంతదూరం ముందుకు నడిచింది.  ఆకలి వేయడంతోపాటు ఆయాసం రావడంతో ఒక జామ చెట్టు కింద ఆగింది. నెమలి అలికిడికి చెట్టు పైన ఉన్న కోకిల నిద్రలేచింది.  కింద ఉన్న నెమలిని చూడగానే "చిట్టీ.. నా కోసం తిరిగి వచ్చేశావాగ నువ్వు వెళ్లిపోయావని నేనెంతగా ఏడ్చానో నీకు తెలియదు. హమ్మయ్య! నువ్వు వచ్చేశావ్. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా ఉంది" అంది. కోకిల మాటలకు నెమలి ఆశ్చర్యపోతూ.. 'నన్ను చిట్టీ అని పిలుస్తోందేమిటి? నా పేరు చిట్టి కాదుగా! ' అని మనసులో అనుకుంటూనే కోకిల వైపు విచిత్రంగా చూడసాగింది.  "అలా విచిత్రంగా, కొత్తగా, ఏమీ తెలియనట్లు తెలియనట్లు చూస్తావే? నాలుగు రోజులు ఎటో వెళ్లొచ్చేసరికి చిన్నినే మరచిపోతావా? స్నేహం అంటే ఇదేనా?" అంటూ మూతి ముడుచుకుంది కోకిల. "పక్క ఊర్లో ఉండే నా యజమాని పెట్టే బాధలు భరించలేక, అతని కన్నుగప...

గుణమే ప్రధానం! (కథ) | Telugu Kadhalu | Moral Stories @multiplewaystogrow

Image
  *గుణమే ప్రధానం!* (కథ)  *అదొక* అందమైన పూల తోట ఆ తోటలో గులాబీ, మల్లె, సంపెంగ, విరజాజి, మందారం వంటి రకరకాల పూల మొక్కలు చాలా ఉన్నాయి. వాటికి విరబూసిన పువ్వులతో ప్రకృతిని ఆహ్లాదపరుస్తున్నాయి.  అప్పుడే ఒక సీతాకోకచిలుక ఎగురుకుంటూ వచ్చి గులాబీ మొక్క మీద వాలబోతూ ఆగింది. 'ఆగావేంటి?' అని ప్రశ్నించింది గులాబీ మొక్క.  "నేను అందంగా ఉన్నానా?" అడిగింది సీతాకోకచిలుక.  అందుకు గులాబీ మొక్క నవ్వుతూ... 'నీకేం తక్కువ? నారింజ రంగు  రెక్కలతో, మధ్యలో నల్లని చిన్ని చిన్ని చుక్కలతో చక్కగా ఉన్నావనుకో!' అని జవాబిచ్చింది.  గులాబీ మొక్క మాటలు సీతాకోకచిలుకలో ఆనందాన్ని కలిగించాయి.. 'నా గురించి మల్లె ఏమంటుందో?' అంటూ మల్లె మొక్క దగ్గరకు వెళ్లి అడిగింది. అప్పుడు మల్లె   సీతాకోకచిలుకతో  'నువ్వు అటూ ఇటూ తిరుగుతూ ఉంటే తోటలో రాణిలా ఉన్నావనుకో!' అంది. మల్లె మొక్క మాటలకు సీతాకోకచిలుక మరింత ఆనందించింది. పక్కనే ఉన్న ముద్దబంతి మొక్కను కూడా తన అందం గురించి అడిగింది.  "గులాబీ, మల్లె చెప్పిన మాటలే నావి కూడా.. నిజంగా చాలా బాగున్నావు నువ్వు!" అంది బంతి మొక్క. 'మీ మాటలు నాకు చాల...

విజయ భాస్కరుని కథ,-మరణం అకాలమ్మున రాదు మహి నెవ్వా రికిని

Image
విజయ భాస్కరుని కథ,-మరణం అకాలమ్మున రాదు మహి నెవ్వా రికిని విక్రమార్కుని మనవడు, విజయ భాస్కరుడు, అతనికి తాత గారి వితరణ, సాహసము దాన గుణము త్యాగం అన్నీ వచ్చినాయి, కానీ విక్రమార్కుని కుమారుడు కీర్తిసేనుడు మాత్రం తండ్రి గుణాలు ఏమాత్రం రాలేదు సరికదా, ఇంకా తండ్రి దానమిచ్చిన సత్రాలు, దేవాలయాలు అన్నీ వుడా లాక్కొని, తనఖజానా నింపుకొని, మా తండ్రిగారు అందరిని సోమరి పోతులను తయారు చేసి పోయారు, ఉచితంగా తిండి దొరికితే ఎవరైనా కష్ట పడుతారా, అని మాన్యాలు కూడ లేకుండా చేసాడు,  అంతటి మహనీయుని కడుపునా ఇలాంటి, దూర్తుడు పుట్టాడు అనుకోని అందరూ కీర్తి సేనుడు కాదు, ఆపకీర్తి సేనుడు అనుకోని విచారము తో వున్నారు.  భాస్కరుడు తానూ చిన్న వాడైనా, పాఠశాల కు వెళ్లే టపుడు దోసిలి నిండా వరహాలు నింపుకొని, దారిలో వుండే యాచకు లకు పంచిపెట్టు తూ వెళ్ళేవాడు,, ఖాజానా నుండి వరహాలు తీసుకోని పోయే సంగతి చాలా కాలం వరకు కీర్తి సేను నికి తెలియ లేదు, ఒకరోజు ఖాజానా కాపలా దారుడు, రాజు చెవినా వేసాడు, అప్పటినుండి, విజయ భాస్కరు నికి, వరహాలు ఇవ్వ రాదనీ కఠినంగా శాసనం చేసాడు,  పెరట్లో తోటలో ఇంద్రుడు ఇచ్చిన కల్ప వృక్షం దగ్గరికి వెళ్లి ప్...

ఎదురీత | Telugu Stories | Moral Stories @multiplewaystogrow

Image
  ఎదురీత | Telugu Stories | Moral Stories @multiplewaystogrow ఎదురీత                                     **** రాజ్యలక్ష్మికి భర్తపోయిన తరువాత అతని ఆఫీస్ లో హెల్పర్ ఉద్యోగం ఇచ్చారు... అది స్టేటు గవర్నమెంట్ ఆఫీస్...  రాజ్యలక్ష్మి భర్త డ్రైవర్ గా పనిచేసే వాడు... అతను ఆఫీస్ డ్యూటీ లో ఉండగా యాక్సిడెంట్ అయి చనిపోయాడు... వెనుక కూర్చున్న సీనియర్ మానేజర్ ఎలాగో బతికి బయట పడ్డాడు.. ఎంతో షాక్ కి గురి అయినా...  మనసులో బాధ ఉన్నా, ఏదో ఆర్ధికంగా ఇబ్బంది పడకుండా పిల్లలను పెంచుకోవచ్చు, సంసారాన్ని ఈదొచ్చు..  అన్న భరోసా కలిగింది... తను పనిచేసే సెక్షన్ లోపదిమంది ఉంటారు... వాళ్ళకి ఒక ఆఫీసర్... ఒక పెద్దాయన యాదగిరి అని, ఇంకో హెల్పర్ ఉన్నాడు అక్కడే....  ఆ సంవత్సరంలోనే రిటైర్ అవుతున్నాడు...  అందుకని ఈమెని అక్కడ వేశారు... ఆమె పని, అడిగిన ఫైల్స్ ఇవ్వడం, అవసరమైన పేపర్ల జిరాక్స్ కాపీలు మెషీన్ లో తీసి ఇవ్వడం... యాదగిరి తెచ్చిన టీ ని కప్పుల్లో పోసి, అందరికీ ఇవ్వడం...  రాజ్యలక్ష్మికు నిండా ముప్...

గోరొంకగూటికే చేరావే చిలుక | Telugu Kadhalu | Moral Stories In Telugu @multiplewaystogrow

Image
మన Channel కి స్వాగతం   ఈరోజు కధ పేరు గోరొంకగూటికే  చేరావే చిలుక                                    ***** శ్రీలక్ష్మి తల్లి ఒక హైస్కూల్ హెడ్ మాస్టర్ గారింట్లో పనిచేసేది. తనకి ఒక్కతే కూతురు.. పనికి వెళ్ళినప్పుడు కూడా శ్రీలక్ష్మిని తీసుకుని వెళ్ళేది...  ఏడెనిమిదేళ్ళ శ్రీలక్ష్మిని గమనించిన ఆయన, కొంచెం చొరవ తీసుకుని, ఎలిమెంటరీ స్కూల్ లో  ఫీస్ కట్టి స్కూల్ లో చేర్పించారు.. కావలసినవి అన్నీ కొనిపెట్టి, అక్కడ టీచర్ కి కొంచెం కనిపెట్టుకుని ఉండమని కూడా చెప్పారు.. స్వతహాగా తెలివైన శ్రీలక్ష్మి చకచక అంది పుచ్చుకుని, అయిదో క్లాస్ వరకూ చదివేసింది. తరువాత ఆయనకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవడంతో,  తను పనిచేసే హైస్కూల్ లో చేర్పించి, అక్కడున్న స్కీమ్ లో నెలనెలా స్కాలర్షిప్ వచ్చేట్టుచేసి వెళ్లిపోయారు. అలా అందరి సహాయంతో పది పాస్ అయింది. కానీ, తరువాత చదివే చదువు డబ్బుతో కూడుకున్నది కాబట్టి.. ఇక చదివినా వాళ్ళ కులంలో అంత చదువుకున్న వాళ్ళు ఉండరని, పెళ్లికి కష్టమని కూడా శ్రీలక్ష్మి ఇంట్లోవాళ్ళకి...