విజయ భాస్కరుని కథ,-మరణం అకాలమ్మున రాదు మహి నెవ్వా రికిని




విక్రమార్కుని మనవడు, విజయ భాస్కరుడు, అతనికి తాత గారి వితరణ, సాహసము దాన గుణము త్యాగం అన్నీ వచ్చినాయి, కానీ విక్రమార్కుని కుమారుడు కీర్తిసేనుడు మాత్రం తండ్రి గుణాలు ఏమాత్రం రాలేదు సరికదా, ఇంకా తండ్రి దానమిచ్చిన సత్రాలు, దేవాలయాలు అన్నీ వుడా లాక్కొని, తనఖజానా నింపుకొని, మా తండ్రిగారు అందరిని సోమరి పోతులను తయారు చేసి పోయారు, ఉచితంగా తిండి దొరికితే ఎవరైనా కష్ట పడుతారా, అని మాన్యాలు కూడ లేకుండా చేసాడు,

 అంతటి మహనీయుని కడుపునా ఇలాంటి, దూర్తుడు పుట్టాడు అనుకోని అందరూ కీర్తి సేనుడు కాదు, ఆపకీర్తి సేనుడు అనుకోని విచారము తో వున్నారు.

 భాస్కరుడు తానూ చిన్న వాడైనా, పాఠశాల కు వెళ్లే టపుడు దోసిలి నిండా వరహాలు నింపుకొని, దారిలో వుండే యాచకు లకు పంచిపెట్టు తూ వెళ్ళేవాడు,, ఖాజానా నుండి వరహాలు తీసుకోని పోయే సంగతి చాలా కాలం వరకు కీర్తి సేను నికి తెలియ లేదు, ఒకరోజు ఖాజానా కాపలా దారుడు, రాజు చెవినా వేసాడు, అప్పటినుండి, విజయ భాస్కరు నికి, వరహాలు ఇవ్వ రాదనీ కఠినంగా శాసనం చేసాడు,

 పెరట్లో తోటలో ఇంద్రుడు ఇచ్చిన కల్ప వృక్షం దగ్గరికి వెళ్లి ప్రార్థంచి, ధనం తీసుకోని, బిచ్చగాళ్ళకు పంచు తుండేవాడు తల్లి శాంతి మతి తో చెప్పి బాధ పడు తుంటాడు ఎందుకమ్మా నేనేమి దుబారాగా ఖర్చు చేయటం లేదే, యాచకులకు దానం చేస్తే తప్పా మా తాతగారు ఎంత వదాన్యులు, ఆయన పేరు నిలపాలని నేను దాన ధర్మాలు చేస్తుంటే నాన్న గారు నాకు, అవరోధం కలిగిస్తూ వున్నారు

 తల్లి కొడుకును ఓదారుస్తూ ఏమి చేయ గలం నాయనా ఒక్కోరికి ఒక్కో బుద్ధి ఇస్తాడు భగవంతుడు, నీవు ఏమి విచారించకు నీవు తప్పు చేయటం లేదని నాకు తెలుసు కదా అంది.

 ఒకరోజు తోట కాపలా దార్లు వచ్చి మహారాజా, యువరాజు గారు వచ్చి ప్రతిదీనం, కల్ప వృక్షం ను అడిగి పైకం తీసుకోని పోతున్నారు అని చెప్పగా, యువరాజును తోటలోనికి అడుగు పెట్ట నివ్వ కూడ దని కట్టు దిట్టం చేస్తాడు,

 అలా జరుగు తుండగా ఒకరోజు భాస్కరుడు తోటలోకి వచ్చి, కల్ప వృక్షం దగ్గర నిలబడి, ఓ వృక్ష రాజమా, నీవు అపాత్రుని వద్ద ఉండ కుండా, తిరిగి నీ స్వస్థాన ముకు వేళ్ళు అని ప్రార్తించి నాడు. దాంతో ఆవృక్షం వేళ్ళతో సహా యెగిరి ఆకాశం లోకి వెళ్లి పోయింది, భ టు లు హహ కారములు చేస్తూ వచ్చి ప్రభూ చిన్నరాజు గారు వచ్చి ఏదో చెప్పగానే ఆచెట్టు ఆకాశం లోకి యెగిరి పోయింది అని విన్నవించు కున్నారు.

 దాంతో పట్టరాని కోపం తో కీర్తి సేనుడు, తల్లి కొడుకులను రాజ్య బహిష్కరణ చేసాడు, పాపం ఎండ కన్నే రుగని మహారాణి శాంతి మతి భాస్కరుని తీసుకోని నడుచుకుంటూ వెళ్తు, రాత్రి సమయం కనుక, అడవిలో ఒక చెట్టు కింద విశ్రాంతిగా కూర్చున్నారు తల్లికి కాళ్ళు, నొప్పులుగా ఉన్నాయి, అని విజయ భాస్కరుడు అమ్మ కాళ్ళు నొక్కు తూ ఉపచారములు చేస్తున్నాడు.

 ఇంతలో ఏదో కలకలం వినిపించింది, భాస్కరుడు చేత కరవాలా మ్ ధరించి ఆదిక్కుగా వెళ్ళాడు, అక్కడ నలుగురు దొంగలు, కలిసి ఒక పన్నెండు ఏళ్ళ బాలిక ను కట్టి వేసి, నోరు మూసి ఆమెను కాళికా దేవికి బలి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ అమ్మాయి గింజు కుంటూ, విడిపించు కోవాలని చూస్తుంది,

 ఆగండి అని వాళ్ళను విరోచితం గా పోరాడి గాయపరిచి, బెదిరించి పంపాడు, ఆ అమ్మాయి కట్లు విప్పి, ఆమెను తల్లి దగ్గరికి పిల్చుకొని వచ్చాడు, ఆమె భయంతో వణికి పోతూ వుంటే మంచి నీళ్ళు తాగించి, ఆమెకు ధైర్యం చెప్పి, కుదుట పడినాకా, నీవు ఎవరూ, ఆ దొంగలు నిన్ను ఎలా ఎత్తుకొని వచ్చారు అని అడిగింది, శాంతిమతి,

 నా పేరు, కల భా షిణి, కోసలా దేశపు రాజ కుమారిని,, నేను నిద్ర పోతుంటే నానోరు మూసి మత్తు మందు వాసన చూపించి, ఎత్తుకొచ్చారు, బలి ఇవ్వ బోతుంటే, మీరూ వచ్చి కాపాడారు. అంది సిగ్గుతో తల వంచుకొని.

 తర్వాత ముగ్గురూ కలిసి నడుస్తూ, ఒక గ్రామం చేరి, ఒక బ్రాహ్మణుని ఇంటిలో తల దాచుకున్నారు, ఆయన చాలా పేదరికం తో వున్నారు, అదిచూసి భాస్కరుడు వాళ్లకు ఏదైనా ఉపకారం చేయాలనుకున్నాడు,

 ఇంతలో ఒక దండోరా విని పించింది, రాజుగారి కూతురిని ఎవరో అపహారించి, తిసుకెళ్లారు, ఆమెను తెచ్చి ఇచ్చిన వారికి నా అర్ధ రాజ్యం, తో పాటు నాకూతురిని ఇచ్చి వివాహము చేస్తాను అని రాజుగారు చెప్పినారు.

 ఆ వార్త విని విజయ భాస్కరుడు, బ్రాహ్మ ను నితో, అయ్యా మీరూ మీకొడుకే రాజకుమారి ని రక్షించి తెచ్చిన్నాడని, రాజుగారికి చెప్పండి,, దాంతో మీ దరిద్రము తీరి మీరూ అందరూ సుఖంగా ఉండ గలరు అనీ సలహా ఇచ్చాడు, ఆకుటుంబము అంతా, చాలా సంతోషం తో పొంగి పోయారు,.

 , కల భాషిణి తీసుకోని బ్రాహ్మణుడు, అతని కొడుకు కామందకుడు, రాజ్య సభ కు వెళ్లి రాజుగారితో తనాకొడుకు దొంగలతో పోరాడి, రాజకుమారిని రక్షించి తీసుకుని వచ్చాడని, ఆయన మాట ప్రకారం, పెళ్ళి చేసి, అర్ధ రాజ్యం ఇవ్వ వలిసింది గా కోరాడు.

 , కానీ కామంద కుని చూస్తే రాజుకు నమ్మకం కుదరలేదు, నలుగురు దొంగలతో ఇతనొక్కడే ఎలా పోరాడి ఉంటాడు ఇతన్ని చూస్తే కత్తి పట్టుకోవటమే తెలిసి నట్లు లేదు అని ఆలోచించి చెప్పుతాము, మీరూ వెళ్లి రండి అని కొన్ని కానుకలు ఇచ్చి పంపించాడు,.

[: కల భాషిణి, తండ్రితో, నాన్న గారూ నన్ను కాపాడి తెచ్చింది ఒక రాజ కుమారుడు తల్లి కూడ వుంది వాళ్ళు ఈ బ్రాహ్మణుని ఇంట్లోనే వున్నారు మీరూ మన భటు లను పంపించి, వాళ్ళను స గౌ రావంగా తోడుకొని రమ్మని చెప్పండి. అంది,

 ఇక్కడ, బ్రాహ్మణుని ఇంట్లో, వాళ్ళు కుట్ర చేసి శాంతి మతిని, భాస్కరుని పెరట్లో బావిలోకి తోసారు ఒక వేళ రాజుగారి భ టు లు, వచ్చి తల్లి కొడుకులను చూస్తే కొంప మునిగి పోతుంది, అని, వాళ్ళు వచ్చేటప్పటికి విజయ భాస్కరుడు, తల్లిని బైటికి తీసి, తానూ కూడా వచ్చి ఇద్దరూ కలిసి ఊరు దాటి వెళ్లి పోయారు,

 భ టు లు వచ్చి చూసి ఇంట్లో ఎవరు లేరు, కొత్తవాళ్లు, ఆ బ్రాహ్మణుడి కుటుంబం మాత్రమే వున్నారు. అమాటే రాజుగారితో విన్న వించుకున్నారు,, తల్లి కొడుకులు వేరే రాజ్యం చేరుకొని అక్కడ తన ప్రతాపం చూపించి రాజుగారి సైన్యం లో దళపతిగా చేరి ఒక ఇల్లు తీసుకోని తల్లితో హాయిగా కాల క్షేపం చేస్తూ గడు పుతున్నాడు,

 ఇక్కడ కల భాషిణి తండ్రితో నేను ఆ రాజ కుమారుడికే మనసిచ్చాను ఆయన ఎపుడైతే నా పాణి గ్రహణం చేసాడో అపుడే ఆయన నాభర్త అని నేను నిర్ణయించు కున్నాను, ఎన్నాళ్ళు అయినా నేను అయనకోసం ఎదురు చూస్తాను, అని మొండి పట్టు పట్టింది, తండ్రి తనకోసం పెళ్ళి సంబంధములు చూస్తూ వుంటే, తండ్రీకి చెప్పకుండా, మంగవేషం ధరించి గుఱ్ఱ మ్ మీద ఆ తల్లీ కొడుకులను వెదుకుతూ బైలు దేరింది.

 విజయ భాస్క రుడు ఆరాజ్యంలో రోజు రాత్రి పూట పహారా తిరుగుతూ కోట చుట్టూ, తిరుగుతూ వున్నాడు, ఆదేశము రాణికి, మంత్రికి, సంబంధం వుంది ఒకరోజు వాళ్ళు తోటలో కలుసుకుని, వుంటే భాస్క రుడు, చూసి పట్టుకోవాలని, ముందుకు వస్తే రా ణి, తనచేతిలోని చాకు బలంగా విసిరింది, అది గురి తప్పి మంత్రికి తగిలింది, దాంతో గాయపడి, మంత్రి చనిపోయాడు,

[ మరుసటి రోజు సభలో రాజు, మంత్రిని హత్య చేసినా నేరానికి భాస్కరునికి ద్విపా న్తర శిక్ష విధించాడు. తల్లీ రోదిస్తూ వుంటే విజయ భాస్కర్ డు, అమ్మా మరణం అకాలమున రాదు మహి నీవ్వరికిని అని నీవు ధైర్యం గా వుండు అని చెప్పి ఓడ ఎక్కి వెళ్లి పోయాడు,

 రాణి మాటలు నమ్మి నిరప రాదికి శిక్ష వేసానా అని రాజుకు మనసులో కలవరం మొదలైంది, రాణి తనను భాస్కర్ బలవంత పెట్ట బోతుంటే, మంత్రి వచ్చి కాపాడా డని, అపేనుగు లాటలో, భాస్కర్ చాకుతో మంత్రిని పొడిచి చంపా డని చెప్పింది అది నమ్మి, రాజు, శిక్ష వేసి నాడు. కానీ అంతరాత్మ ఒప్పుకోవటం లేదు,

 నిద్ర పట్టక లేచి, మారు వేషంలో నగరం లో తిరుగు తున్నాడు, ఒక ఇంట్లో భార్యా భర్తలు, మాట్లాడుకుంటూ వున్నారు, కిటికీ దగ్గర నిలబడి విన సాగాడు,

 భార్య అంటుంది, నిజంగా, ఆ యువకుడు నేరం చేయ లేదు, లేకపోతె అంతా రాత్రి పూట మంత్రి ఏందుకు, రాణి వాసం లో వున్నాడు, ఆకస్మా త్తు గా ఎలా అతనితో కలబడి నాడు, మీరే ఆలోచించండి, భర్త నవ్వుతూ భలే తీర్పు చెప్పావే, నిన్నే రాజుగారు చెప్ప మంటే, ఇలాగే చెప్పు తావా, అన్నాడు, ఆ ఆ, చెపుతాను నాకేమి భయం లేదు అంది, ఇద్దరూ కిల కీలా నవ్వుతూ పడుకున్నారు,

 రాజుకు జ్ఞానోదయం కలిగింది, తెల్లారి రాజ్య సభకు ఆభార్య భర్తలు, ను రమ్మని కబురు పంపించాడు,

 వారు వచ్చి నిలబడినారు, ఏమ్మా నీవు నిజం నిరూ పించగలవా అని అడిగితె ఆమె చిత్తం మహారాజా అంది.

 రాణి ని పిలిపించి, ఆరోజు రాత్రి ఏమి జరిగిందో, చెప్పమని అడిగితె రాణి తానూ నిద్ర పట్టక తోటలో, పచార్లు చేస్తూ వుంటే, భాస్కరుడు, వచ్చి తనను బలవంతం చేయబోగా, మంత్రి వచ్చి కాపాడా డని, చెప్పితే, మంత్రి యెందుకు అసమయం లో ఎలా వచ్చాడు అని అడిగితె జవాబు చెప్పేందుకు తడబడింది,

 చూసారా రాజా ఈమె చెప్పే దానిలో నే, అసత్యం వుంది, రాణికి మంత్రికి సంబంధం వుంది, భాస్కరుడు, చూసి బైట పెట్టు తాడని చాకు విసిరితే అది మంత్రికి తగిలి, చనిపోయాడు, అది జరిగిన సంగతి అని, యుక్తిగా వాదించి రాణి దోషి అనీ, నిరూపించింది

 రాజు కూడ అంగీకరించి,, రాణికి కారా గార శిక్ష విధించి, ఇంకో ఓడ మీద కొంతమంది పరి చారులను పంపించి, విజయ భాస్కరుణ్ణి వెనక్కు తీసుకోని రమ్మని పంపించాడు,

 కాలాభా షిణి అన్నీ దేశాలు తిరిగి చివరకు ఈ రాజ్యము చేరి శాంతిమతిని, కలుసుకొని, నేను మీ కొడుకు కాపాడి న రాజ కుమారిని, నేను అతనికి మనసు ఇచ్చాను, అందుకే మిమ్ములను వెదుకుతూ వచ్చాను అంది ఆమె బోరుమని ఏడుస్తూ, తల్లీ నీవు ఎంత దురదృష్ట వంతు రాలివి

 విజయ భాస్కరుడు, నేరస్తుడని ముద్ర వేసి ద్విపంతర వాసము విధించి రాజు పంపించినాడు, నీవు అతన్ని వరించి ఇంత దూరము వెదుకుతూ వచ్చావు కానీ అతడే మనకు దూరమైనడు అనీ ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చు కుంటూ వున్నారు,

 ఓడలో సముద్రములో వెళుతూ ఉంటే ఒక పెద్ద ఉక్కు స్థంబం అడ్డుగా నిలిచింది, ఓడలోని వాళ్ళు భయపడుతూ వున్నారు సరంగు, ఇలా చెప్పాడు, ఈ స్థంభం ఎపుడైనా ఇలాగే ఎదురు వస్తుంది ఎవరో ఒకరు దానికి బలి ఐతే పోతుంది లేకుంటే ఓడ తిరగబడి అందరం ఆహతి అవుతాము, అపుడు భాస్కరుడు, నేను ఎలాగూ శిక్ష పడిన వాణ్ణే, కనుక, నేను ఆ స్థంభం కు ఎదురు నిలుస్తాను, అని సముద్రంలోకి దూకి ఆ స్థంభం మీదికి, ఎక్కాడు, ఓడ లోని వారు అందరూ, నివ్వేర పోయి చూస్తూ ఉండి పోయారు.

 ** సమాప్తం **

ధన్యవాదాలు,


Comments

Popular posts from this blog

నమ్మకమే.. స్నేహం! | Moral Stories | Telugu Stories @multiplewaystogrow

The Adventures of Sunny and Sparkle | Friendship Stories | Moral Stories @multiplewaystogrow

Amazon is hiring for Associate – Retail Process | Apply Now