కరుణాసాగరం-Moral Stories in Telugu-Telugu Stories @multiplewaystogrow
"9 ఏళ్ల వయసున్న చిన్న కుర్రాడు సాగర్. ఆ పసి బాలుడు అమ్మానాన్న ఒక భవంతి దగ్గర ఇటుకలు మోస్తూ, కూలి పని చేసుకుంటున్నారు. సాగర్ కు రోజు మెయిన్ ఉన్రోడ్డు మీద ఉన్న షాపులను చూస్తూ, కాలం గడపడం ఇష్టం .ఆరోజు చాలామంది పిల్లలు స్కూలుకు వెళ్తూ, సరదాగా గంతులు వేస్తూ, చక్కని బట్టలతో నీటిగా వెళ్లడం చూసి, అయ్యో దేవుడా! నాకు కూడా మంచి బట్టలు బూట్లు ఇవ్వలేవా? అంటూ మనసులోనే బాధపడుతూ, మా అమ్మ నాన్న కూలి డబ్బులతో గంజినీళ్లు కూడా ఒక్కొక్క రోజు కరువయ్యేవి, నాకు ఎలా కొంటారు నేను ఎలా చదువుకుంటాను? అన్న మాటలు ఆ పసి మనసులో మెదులుతూ ఉండేవి. ఆ రోజు కూడా రోజు లాగానే ,ఒక 'స్పోర్ట్స్ షాపు ముందు నిలబడి, గాజు అద్దాల,లోంచి లోపలికి చూస్తూ, అక్కడకు వచ్చే తల్లిదండ్రులు తమ పిల్లలకు నచ్చినవి చూపిస్తూ కొనుడం , ఆ పిల్లలు అవి వేసుకుని, షాప్ అంతా సరదాగా పరిగెడుతూ చిందులు వేయడం, చూస్తూ అయ్యో! అమ్మా నాన్న దగ్గర కూడా డబ్బులు ఉంటే, నేను కూడా మంచి బూట్లు కొనుక్కొని, మంచి బట్టలు వేసుకుని చక్కగా స్కూలుకు వెళ్లి చదువుకుంటాను కదా!, అనుకుంటూ అక్కడే పెద్ద 'వెంకటేశ్వర స్వామి' ఫోటోను చూస్తూ ఆ పసి హృదయం బాధపడుతూ ఉండేది. ...