బామ్మగారి కథలు స్నేహితురాళ్ళు | Telugu Stories | Moral Stories in Telugu @multiplewaystogrow


 బామ్మగారి కథలు స్నేహితురాళ్ళు | Telugu Stories | Moral Stories in Telugu @multiplewaystogrow


బామ్మ బజారులో తన స్నేహితురాలు సూరమ్మతో నడుస్తోంది. కొంతదూరం నడిచాక “ఇదిగో బామ్మా కాళ్ళు ఆకాశంలోకి లాగేస్తున్నాయి, ఇహ నేను ఒక్క అడుగుకూడావేయలేను, పెద్ద సైజు కొబ్బరిబొండాం కొట్టించి అందులో పీల్చే గొట్టం పెట్టించి ఇవ్వు తల్లీ” అంటూ గాంధీ తాత విగ్రహమ్ముందు చతికిల పడింది సూరమ్మ. “ఈ మహానుభావుడు ఏం పుచ్చుకునేవాడో దుక్కలా ఉన్నాడు” విగ్రహంవైపు చూస్తూ అంది. “ఇదిగో ఉన్నవాటిల్లో పెద్ద కొబ్బరిబొండాం కొట్టించాను కావలసినంత నీరు జుర్రుకుని అవతలకి విసురు” అంది బామ్మ. “మరి లోపలి గుజ్జో, బోలెడన్ని డబ్బులుపోసి కొనుక్కుని అది తినకుండా పాడేస్తామా ఏమిటి” అంది సూరమ్మ. “సరేలే! ముందర బోండాం ఖాళీ చేస్తే అమ్మినవాడి దగ్గరకెళ్లి గుజ్జు తీయించి పట్టుకొస్తాను, ఇంటికెళ్ళాక అరుగుమీద కూర్చుని తిందువుగాని” అంది బామ్మ సూరమ్మ దగ్గర కొబ్బరిబొండాం అందుకుంటూ.
“ఈ కొబ్బరి గుజ్జులో రెండు గరిటెలు పంచదార వేసుకుని తింటే ఉంటుందీ నాసామిరంగా” అంటూ అరుగుమీద కూర్చుంది సూరమ్మ. బామ్మ లోపలినుండి పంచదార తెచ్చి కొబ్బరి గుజ్జులో వేసి చిన్న చెంచా అందించింది. “ఆహా! స్వర్గానికి బెత్తెడు దూరం అంతే బామ్మా” అంటూ గుజ్జు నోట్లో వేసుకుంది. “గాడిద గుడ్డు, కొబ్బరి గుజ్జు సరే నా డబ్బులు మాత్రం క్షవరం చేశావు, రేపు వచ్చేటప్పుడు వందరూపాయలు పట్రా, ఇక్కడికి వచ్చాక మర్చిపోయాను, ముసలితనం అన్నావంటే మాటా మర్యాదా దక్కదు” అంది బామ్మ. “సర్లే ఈ వయసులో డబ్బులు పోగేసి ఏమిచేసుకుంటావే” అంది సూరమ్మ.
“ఇదిగో సూరమ్మా! స్నేహితురాలవు కాబట్టి వదిలేస్తున్నాను. కొబ్బరి గుజ్జు బొజ్జలోకి వెళ్ళేటప్పటికి వికారం తన్నుకుని బయటకి వస్తున్నట్లుంది, ముసలి కొండముచ్చు మొహం నువ్వూనూ పొద్దున్నే డబ్బులు తెచ్చేయి. డబ్బుల దగ్గర ఎవరూ దగ్గరకాదు, ఇవ్వకపోతే ఢమరుకం వాయించేస్తాను. లోపలికిరా మీ మనవడికి నాలుగు చేగోడీలు ఇస్తాను పట్టుకెళ్లు” అంది బామ్మ లోపలికి వెడుతూ. “నాకు ఇచ్చినలాంటి చేగోడీలేనా” అంది సూరమ్మ నవ్వుతూ, బామ్మ వెంట నడుస్తూ.

All reaction

Comments

Popular posts from this blog

నమ్మకమే.. స్నేహం! | Moral Stories | Telugu Stories @multiplewaystogrow

The Adventures of Sunny and Sparkle | Friendship Stories | Moral Stories @multiplewaystogrow

Amazon is hiring for Associate – Retail Process | Apply Now