ఎదురీత | Telugu Stories | Moral Stories @multiplewaystogrow
ఎదురీత | Telugu Stories | Moral Stories @multiplewaystogrow ఎదురీత **** రాజ్యలక్ష్మికి భర్తపోయిన తరువాత అతని ఆఫీస్ లో హెల్పర్ ఉద్యోగం ఇచ్చారు... అది స్టేటు గవర్నమెంట్ ఆఫీస్... రాజ్యలక్ష్మి భర్త డ్రైవర్ గా పనిచేసే వాడు... అతను ఆఫీస్ డ్యూటీ లో ఉండగా యాక్సిడెంట్ అయి చనిపోయాడు... వెనుక కూర్చున్న సీనియర్ మానేజర్ ఎలాగో బతికి బయట పడ్డాడు.. ఎంతో షాక్ కి గురి అయినా... మనసులో బాధ ఉన్నా, ఏదో ఆర్ధికంగా ఇబ్బంది పడకుండా పిల్లలను పెంచుకోవచ్చు, సంసారాన్ని ఈదొచ్చు.. అన్న భరోసా కలిగింది... తను పనిచేసే సెక్షన్ లోపదిమంది ఉంటారు... వాళ్ళకి ఒక ఆఫీసర్... ఒక పెద్దాయన యాదగిరి అని, ఇంకో హెల్పర్ ఉన్నాడు అక్కడే.... ఆ సంవత్సరంలోనే రిటైర్ అవుతున్నాడు... అందుకని ఈమెని అక్కడ వేశారు... ఆమె పని, అడిగిన ఫైల్స్ ఇవ్వడం, అవసరమైన పేపర్ల జిరాక్స్ కాపీలు మెషీన్ లో తీసి ఇవ్వడం... యాదగిరి తెచ్చిన టీ ని కప్పుల్లో పోసి, అందరికీ ఇవ్వడం... రాజ్యలక్ష్మికు నిండా ముప్...