గోరొంకగూటికే చేరావే చిలుక | Telugu Kadhalu | Moral Stories In Telugu @multiplewaystogrow




మన Channel కి స్వాగతం 


 ఈరోజు కధ పేరు


గోరొంకగూటికే  చేరావే చిలుక 

                                  *****

శ్రీలక్ష్మి తల్లి ఒక హైస్కూల్ హెడ్ మాస్టర్ గారింట్లో పనిచేసేది. తనకి ఒక్కతే కూతురు..

పనికి వెళ్ళినప్పుడు కూడా శ్రీలక్ష్మిని తీసుకుని వెళ్ళేది... 

ఏడెనిమిదేళ్ళ శ్రీలక్ష్మిని గమనించిన ఆయన, కొంచెం చొరవ తీసుకుని, ఎలిమెంటరీ స్కూల్ లో  ఫీస్ కట్టి స్కూల్ లో చేర్పించారు..

కావలసినవి అన్నీ కొనిపెట్టి, అక్కడ టీచర్ కి కొంచెం కనిపెట్టుకుని ఉండమని కూడా చెప్పారు..

స్వతహాగా తెలివైన శ్రీలక్ష్మి చకచక అంది పుచ్చుకుని, అయిదో క్లాస్ వరకూ చదివేసింది.

తరువాత ఆయనకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవడంతో,  తను పనిచేసే హైస్కూల్ లో చేర్పించి, అక్కడున్న స్కీమ్ లో నెలనెలా స్కాలర్షిప్ వచ్చేట్టుచేసి వెళ్లిపోయారు.

అలా అందరి సహాయంతో పది పాస్ అయింది.

కానీ, తరువాత చదివే చదువు డబ్బుతో కూడుకున్నది కాబట్టి..

ఇక చదివినా వాళ్ళ కులంలో అంత చదువుకున్న వాళ్ళు ఉండరని, పెళ్లికి కష్టమని కూడా శ్రీలక్ష్మి ఇంట్లోవాళ్ళకి  అనిపించి ఊరుకున్నారు.

కథల పుస్తకాలు, సినిమా పత్రికలు చదివేది.

సినిమాలు చూడటం ఎలాగూ సాధారణం కదా..

వాటి ప్రభావం వలన ఉన్నదానిలోనే చక్కగా డ్రెస్ చేసుకుని, నీట్ గా ఉండేది. దానివలన తను

మామూలుగా ఉన్నా తనని చూసిన వాళ్ళు ఎవరైనా ఒక్కక్షణం చూపు తిప్పుకోలేక పోయేవారు..

నీకూతురు పెద్దింటి అమ్మాయిలా ఉంటుందే అంటే, శ్రీలక్ష్మి తల్లి మురిసిపోయేది...

వాళ్ళ నాన్న సింహాద్రి వాళ్ళ ఊళ్లోనే,  ఒకధాన్యపు గోడౌన్ లో డ్రైవర్ పని చేస్తాడు..  లారీలో లోడింగ్, అన్ లోడింగ్ చేస్తాడు .

వాళ్ళు జీతం కాకుండా నెలనెలా ఓఇరవైకిలోల బియ్యం ఇస్తారు .

వాళ్ళకి బాగానే గడిచిపోతుంది..

అయితే అనుకోకుండా ఆహెడ్మాస్టర్ కబురుచేశారు ఎలాగో ఆ స్కూల్ లో పనిచేసిన పాత టీచర్ ద్వారా..విషయం ఏంటంటే..

వాళ్ళమ్మాయి హైదరాబాద్ లో ఉంటుందిట..

భార్యాభర్తలు సాఫ్టువేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారుట..ఇద్దరు పిల్లలు..

శ్రీలక్ష్మిని ఒక సంవత్సరం తమ కూతురి దగ్గర ఉండేలా పంపమని...

సంవత్సరానికి ఒకసారి లక్షరూపాయలు గానీ,  నెలనెలా పదివేలు వేలు అయినా, ఎలా కావాలో అలా ఇస్తారని...

శ్రీలక్ష్మి ఖాళీగా ఉందని తెలిసీ అడుగుతున్నట్లు,

వాళ్ళ పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించి, సాయంత్రం బస్ నుండి దింపుకొని, వాళ్ళు ఇంటికి వచ్చేవరకూ చూసుకోవాలని ...

వేరే ఇంటిపనులకి పనిమనిషి ఉందని..

తమ ఇంట్లోనే ఒక గదిఇచ్చి, తిండి, బట్ట ఇతర అవసరాలు చూస్తారని..

నమ్మకమైన మనిషి కోసం చూస్తుంటే గుర్తొచ్చి అడుగుతున్నట్టుగా..

శ్రీలక్ష్మి తల్లితండ్రులకి ఆ కుటుంబం ఎంత తెలిసినా.. ఒక్కగానొక్క బిడ్డని అంతదూరం పంపించాలంటే భయపడ్డారు..

తమ కూతురికి పెళ్లిచేసే ఆలోచన ఉందని చెప్పారు...

ఒక సంవత్సరం అయితే మాత్రం పంపుతామని..అంతకుమించి ఉంచలేమని కూడా..

దానికి వాళ్ళు వొప్పుకున్నారు వాళ్ళు..

ఈలోపు ఏదోదారి దొరక్కపోదు అనే ధీమాతో..

శ్రీలక్ష్మి కూడా వొప్పుకుంది..మాస్టారు గారి కూతురు కరుణ తెలిసి ఉండటం ఒకటి..

సిటీలో ఉండే అవకాశం వచ్చిందని కూడా..

ఓరెండు రోజుల్లో,  సింహాద్రి కూతురిని హైదరాబాద్ తీసుకుని వెళ్లి వాళ్ళింట్లో దింపివచ్చాడు...

కరుణా వాళ్ళు ఉండేది సకల సౌకర్యాలతో ఉన్న గచ్చిబౌలిలో పెద్ద గేటెడ్ కమ్యూనిటీ..

శ్రీలక్ష్మికి వాళ్ళు చెప్పినట్టుగానే బాత్ రూం కలిపి ఉన్న చిన్న గెస్ట్ బెడ్రూం లాంటిది ఇచ్చారు..

ఆరోజు సాయంత్రం కరుణ శ్రీలక్ష్మి తో ..నీ బట్టలు మడత పెట్టి నీపెట్టెలో పెట్టేసుకో..

మళ్లీ మీ ఊరెళ్లేటప్పుడు తీసుకుని వెల్దువు గానీ, అని షాప్ కి తీసుకెళ్ళి, ఇక్కడ శ్రీలక్ష్మి వయసు వాళ్ళు వేసుకునే డ్రెస్ లు లాంటివి, సౌకర్యంగా ఉండేవి ఒక నాలుగు కొంది..

ఇంట్లోఉన్న వాడని ఒక పాత స్మార్ట్ ఫోన్ ఇచ్చి అన్నీ నేర్పించింది...

అందులో శ్రీ లక్ష్మికి అవసరమైన ఫోన్ నంబర్లు ఫీడ్ చేసి ఇచ్చింది...

ఒకరోజు దగ్గరుండి స్కూల్ బస్ వచ్చే చోటు చూపించింది...

స్వతహాగా చురుకైన శ్రీలక్ష్మి అన్నీ ఇట్టే నేర్చేసుకుంది...

కరుణ భర్త సుధాకర్ కి ఎక్కువగా అఫిషియల్ ట్రిప్స్ ఉంటూ ఉండేవి...

నెలలో రెండు వారాలు ఇంట్లో ఉండేవాడు కాదు 

అందుకని కరుణకి ఇంట్లో శ్రీలక్ష్మి లాంటి అమ్మాయి ఉండటం చాలా సౌకర్యంగా అనిపించేది..

శ్రీలక్ష్మికి పిల్లల్ని స్కూల్ కి పంపించేసాకా అంతా ఖాళీనే...

ఫోన్ తో, టీవీ తో కాలక్షేపం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం చేసేది..

ఇలా అక్కడ వాతావరణానికి పూర్తిగా అడ్జస్ట్ అవుతుండగా..

తనలాగే పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించడానికి వచ్చే 

గిరీష్ పరిచయమయ్యాడు..

అక్కడ అతను వేరే బ్లాక్ లో ఉండే ఒక డాక్టర్ కి కార్  డ్రైవర్...

వాళ్ళకి పొద్దున్న 9 గంటలకి అతని అవసరం ఉంది ..

ఈలోపు రోజు పిల్లలని స్కూల్ బస్ ఎక్కించాలి...

సాయంత్రం వాళ్ళింట్లో ఉండే వేరే పని అమ్మాయి వచ్చి తీసుకుని వెడుతుంది...

గిరీష్ చూడటానికి బావుంటాడు..

ఇద్దరికీ కొద్దిగా మాటలు పెరిగాయి..శ్రీలక్ష్మి తను ఇక్కడికి కొత్తగా వచ్చిందని చెప్పింది..

గిరీష్ తనకి నెలకి పాతిక వేలు జీతం ఇస్తారని కూడా చెప్పాడు.

తన ఫోన్ నంబర్ ఇచ్చాడు..శ్రీలక్ష్మి ఫోన్ నంబర్ తీసుకున్నాడు...

అతనికి ఖాళీ ఉన్నప్పుడు చేస్తే, తను అప్పుడు ఖాళీగా ఉంటే మాట్లాడేది..

కానీ తన పనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేసేది కాదు...

కరుణ పిల్లలు బాగా మాలిమి అయ్యారు...

శ్రీలక్ష్మి ఇంకా రెండు మూడునెలల్లో వెళ్ళిపోతుంది అంటే కరుణకి బెంగగా ఉండేది..

ఈలోపు గిరీష్ శ్రీలక్ష్మికి చెప్పనే చెప్పాడు..తనకి శ్రీలక్ష్మి అంటే ఇష్టమని, తనకీ ఇష్టమైతే పెళ్లి

చేసుకుంటానని..

శ్రీలక్ష్మి మొదట భయపడింది..తరువాత వాళ్ళ అమ్మా నాన్నా వొప్పుకోరని కూడా చెప్పింది...

కానీ గిరీష్ నచ్చ చెప్పాడు...

వొప్పుకొక పోయినా మనిద్దరికీ ఇష్టం కాబట్టి పెళ్లి చేసుకుందాం అన్నాడు...

తనకి చాలా మంది స్నేహితులు ఉన్నారని, పుణె లో ఒక స్నేహితుడు అక్కడికి రమ్మంటున్నాడనీ,

అక్కడ క్యాబ్ డ్రైవర్ గా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తున్నాడని...

శ్రీలక్ష్మి లాంటి వాళ్ళ అవసరం కూడా అలాంటి నగరాల్లో ఎక్కువ ఉంటుందనీ, ఇంతకంటే ఎక్కువ

జీతం అక్కడ ఇస్తారని...ఇద్దరూ కలిసి నెలకి అరవై వేలు సంపాదించొచ్చు, దర్జాగా బతకోచ్చు అని...

ఒక రెండేళ్లు దూరంగా ఉంటే యింట్లో పెద్దవాళ్ళు వాళ్ళే వొప్పుకుంటారు అని కూడా ...

ఆలోచించమని చెప్పాడు శ్రీలక్ష్మికి...

అప్పుడే ఈకొత్తజీవితానికి అలవాటుపడుతున్న శ్రీలక్ష్మికి  గిరీష్ చెప్పింది ఆకర్షణీయంగా కనిపించసాగింది...

మళ్లీ తన ఊరు వెడితే అక్కడే ఎవరినో ఒకరిని చేసుకుని ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోవాలని...గిరీష్ చెప్పినట్టు చేస్తే  తప్పేముంది'  అని కూడా ..

అంతలో  కరుణా వాళ్ళకి మూడు నాలుగు రోజులు సెలవులు వచ్చాయి వరుసగా, శుక్ర సోమవారాలు వేరే కమ్యూనిటీ పండుగలు ఏవో రావడంతో...అందరూ ఇంట్లో ఉండటం తో శ్రీలక్ష్మి కి బయటికి వచ్చే అవకాశం లేదు.

ఒకరోజు రాత్రి టీవీ లో సినిమా చూస్తూ కరుణ

శ్రీలక్ష్మిని కూడా చూడమని పిలిచింది...

శ్రీలక్ష్మి కూడా అక్కడే సోఫా పక్కన చతికిల పడి సినిమా చూస్తోంది..

అదొక టాప్ హీరోయిన్ సినిమా...

అందులో ఆమెది ఒక పల్లెటూరి అమ్మాయి పాత్ర...

తను చాలా అందంగా ఉంటుందని...ఏ హీరోయిన్ కీ తీసిపోనని అనుకునే, అమాయక పాత్ర...!

ఆఅమ్మాయి బలహీనతని ఆధారంగా చేసుకుని, ఆఊళ్ళో ఉండే ఓ యువకుడు ఆఅమ్మాయిని ప్రేమ పేరుతో బుట్టలో వేసుకుని,  హీరోయిన్ చేస్తానని

నమ్మించి,  ఆఅమ్మాయికి ఉన్న నగలతో సహా ఒక అర్ధరాత్రి బొంబాయికి తీసుకుపోతాడు..

అక్కడ ఆఅమ్మాయి నగలు కాజేసి,  ఆమెను ఒక  వేశ్యావాటికలో అమ్మేస్తాడు..

అక్కడ ఆమె వెతలు..ఓమూడుగంటల సినిమా..

అది చూసి కరుణ అంది.."ఏంటో ఈ అమ్మాయిలు..ఇరవైఏళ్ళు పెంచిన తల్లితండ్రుల ప్రేమకన్నా, కొద్ది రోజుల పరిచయం ఉన్న ఒక కొత్తవాడి ప్రేమని నమ్మి వెళ్లిపోవడం..

ఇలాంటి ఘోరాలని చూస్తుంటే బాధేస్తుంది"..అని..

అనగానే, కరుణ భర్త అవినాష్ అన్నాడు, "ప్రేమమ్మా" అని...

'అవును ప్రేమే..నిజమైన ప్రేమ అయితే మంచిదే'.

ఇలాంటి మోసగాళ్లని చూస్తుంటే భయం వేస్తుంది..

అదే తల్లితండ్రులని వొప్పించి చేసుకుంటే ఎంత అండగాఉంటారు వాళ్ళు..

ఇప్పుడు ఈఅమ్మాయిలాంటి వాళ్ల గతి ఏంటి.. తల్లితండ్రుల దగ్గరికి తిరిగిపోదాం అన్నా పోలేరు కదా...అంది బాధగా...

శ్రీలక్ష్మి మౌనంగా తన రూంకి వెళ్ళిపోయింది...

పడుకున్నా అదే ఆలోచన..కరుణ మాటలు

ప్రతిధ్వనిస్తున్నాయి శ్రీలక్ష్మికి..

మర్నాడు శ్రీలక్ష్మి తల్లి ఫోన్ చేసింది...

కూతురి యోగక్షేమాలు కనుక్కుని, అసలు విషయం చెప్పింది ..

"తల్లీ..నీపెళ్లి కాయం చేసినాం..

మీఅయ్య  పెద్దమ్మ కూతురు కొడుకు,  శ్రీనివాసు తెలుసు కదా..ఆ యబ్బాయితో..

పిలగాడు సుడ్డానికి బాగుంటాడు... విజీవాడ లో ఏదో ఆఫీసులో పని చేస్తున్నాడట...

నీతో పెళ్లి అంటే ఎంటనే వొప్పుకున్నాడంట...

'నాకూతిరికేంటి బంగారం ఎవరైనా వొప్పుకుంటారు'..

అని.. మీనాన్న గప్పాలు కొట్టుకుంటున్నాడు అంది మురిపెంగా...

'మంచి పిలగాడు..మన కల్ల ముందు ఉంటాది పిల్ల'  అని కూడా సంబర పడుతున్నాడు..

అయ్యవారు 'ఓ మూడునెలల తరవాత మంచి రోజులున్నాయి'  అన్నారు...

నీకు సెపుదారని చేసినా" అంది ఎంతో  సంతోషంగా..

శ్రీలక్ష్మి ఒక్క నిముషం ఆగి, గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి అంది...

"మీ ఇష్టం అమ్మా.. నువ్వూ, అయ్యా  ఎలా చెప్తే అలా" అని మనస్పూర్తిగా...


సమాప్తం


ధన్యవాదాలు,

మరి కొన్ని కధలు కోసం మన ఛానల్ ని Like చేసి Subscribe చేసుకోండి.


మీ శ్రేయాభిలాషి,

Multiplewaystogrow

Comments

Popular posts from this blog

నమ్మకమే.. స్నేహం! | Moral Stories | Telugu Stories @multiplewaystogrow

The Adventures of Sunny and Sparkle | Friendship Stories | Moral Stories @multiplewaystogrow

Amazon is hiring for Associate – Retail Process | Apply Now