Posts

Showing posts with the label birds stories

*కిలకిల.. నా పేరు వెన్నెల...!

Image
*అదొక* చిట్టడవి. అందులో ఒక జామ చెట్టు మీద కాకి, కోకిల, పావురం కలిసి నివసిస్తున్నాయి. ఒక రోజు ఆ చెట్టు మీదకు ఒక చిలుక వచ్చి వాలింది. అవి మూడూ కూర్చున్న కొమ్మకు ఎదురుగా ఉన్న కొమ్మ మీద చేరింది. "నా వంక' వింతగా చూడకండి. నా పేరు వెన్నెల. నే పలుకుతా కిలకిలా! మీ పక్కనే ఉన్న అడవిలో ఉంటాను" అంది. "మరి ఇక్కడికి ఎందుకొచ్చావు?' అని కాకి, వెన్నెలకేసి సందేహంగా చూస్తూ అడిగింది. "ఏముంది. మీ కలివిడితనం, స్నేహం గురించి అక్కడ విన్నాను. మీతో స్నేహం చేయాలనిపించి ఇలా వచ్చాను. మంచివారితో స్నేహం ఎప్పుడూ మంచిదేనని మా అమ్మ చెప్పేది. మీతో మైత్రి చేయవచ్చా?" అని వెన్నెల ఆ మూడింటినీ అడిగింది. "నీ చిలుక పలుకులు మాకు నచ్చాయి. మా గురించి తెలుసుకుని వచ్చానన్నావు. నీతో స్నేహం మాకిష్టమే" అని కోకిల నవ్వుతూ సమాధానమిచ్చింది. "ఇక నుంచి మనం ముగ్గురం కాదు.. నలుగురం" అని పావురం హుషారుగా అంది. "జాబిల్లి కూడా ఉండి ఉంటే, అయిదుగురం అయ్యేవాళ్లం కదా" అని కోకిల దీనంగా అంది. "అసలు.. ఆ జాబిల్లి గురించి మాట్లాడకు. అది మోసం చేసి వెళ్లిపోయింది. మనల్ని మర్చిపోయింది. మన దృష్...