తాతయ్య మెచ్చిన పాటలు (కథ) | Moral Stories In Telugu | Story Telling Telugu @multiplewaystogrow
తాతయ్య మెచ్చిన పాటలు (కథ): "హరిణీ! ఆ గోల ఏంటి? చిరాకు వస్తుంది. కొంచెం ఆపుతావా?" కోపంగా అన్నాడు తాతయ్య రామయ్య.. "నా పాట గోలగా ఉందా? మా పాఠశాలలో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అందరికీ నా పాటలే ఇష్టం. నేను మా పాఠశాలలో నంబర్ వన్ గాయకురాలిని. నన్ను ఇంత అవమానిస్తావా?" అంటూ కోపంగా వెళ్ళిపోయింది హరిణి. వాళ్ళ ఇంటికి హరిణి వాళ్ళ అమ్మ మాలిని. వాళ్ళ చిన్ననాటి స్నేహితురాలు కమల వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చింది. అతిథి మర్యాదల తర్వాత సరదాగా మాట్లాడుకుంటున్నారు. మాటల సందర్భంలో వాళ్ళ పిల్లల గొప్పతనం గురించి చెప్పుకుంటున్నారు. మాలిని తన కూతురు చాలా బాగా పాడుతుందని, తన కూతురి పాటలను అభిమానించేవారు చాలా మంది ఉన్నారని గొప్పలు చెబుతుంది. "మాకూ ఆ పాటలు వినాలని ఉంది." అన్నది కమల. అమ్మ పిలవగానే వచ్చి హరిణి పాటలు పాడడం మొదలుపెట్టింది. కాసేపు అయ్యాక తాతయ్య "అమ్మా శివానీ జండూ బాం తీసుకుని రామ్మా! నాకు తలనొప్పిగా ఉంది." అని పక్క గదిలోంచి రామయ్య పిలిచాడు. హరిణి చిన్నబుచ్చుకుంది. అతిథులు వెళ్ళిపోయాక "ఏంటమ్మా! తాతయ్య పద్ధతి నాకు...