మాక్లీ దుర్గంలో కుక్క | Telugu Stories | Moral Stories in Telugu @multiplewaystogrow


 మాక్లీ దుర్గంలో కుక్క | Telugu Stories | Moral Stories in Telugu @multiplewaystogrow

మాక్లీదుర్గం స్టేషను చాలా చిన్న. అందులో చిన్న అంగడి ఉంది. రైళ్ళు వచ్చేవేళకు ఆ అంగడి తెరిచి ఉంటుంది. ఒకకుక్క అంగడి తెరచి నప్పు డల్లా ఆక్కడ తయారు. అంగడి ఎత్తుగా ఉంటుంది. కుక్క తన చూపు అంగడిలోని పళ్ళికలలో ఉన్న మిఠాయిమీద పడేఅంత సమరేఖలో ఉంచుకొని ఊర్ధ్వదృష్టితో తపస్సు చేస్తుంది. ఎప్పుడైనా, యెవ డైనా కొనుక్కునేటప్పు డైనా చిన్న ముక్క జారి పడుతుం దేమో అని యెదురు చూస్తూ ఉంటుంది. వారానికో పదిరోజులకో అట్లా యెప్పుడూ పడదు గాని, పదిరోజులక్రింద చేసినపకోడీ కొనుక్కొన్న వాడు చద్దివాపన వేసి పొరేస్తే కుక్క- డాన్ని నోటితో ఆగావుగా పట్టుకొని ముందుపళ్ళతో నొక్కి అంగట్లోకి పోయేందుకు రెండుగ తుకులు గతికి మ్రింగి దగ్గు వచ్చి మళ్ళీ కక్కుతుంది. రైలు వెళ్ళిపోవటంతో అంగడివాడు మూస్తాడు. కుక్క పోయి సెలయేట్లో నీళ్లు తాగుతుంది. ముందు కాళ్ళు చాచి గడ్డిమీద పడుకొని, లేతగరిక పోచలు కొరుకుతుంది. ఆకుక్క మంచి మిడితల వేటగాడు. అప్పు డప్పుడు పొలము పిచ్చుకలను గూడా పట్టుకుంటుంది. సెలయేటినీళ్లూ, మంచిగాలీ, లోయలోకి దిగటం, ఎక్కటం — కుక్క మంచి దేహపటుత్వంలో ఉన్నది, కుక్క చెదరిఐనా స్టేష నెదురుగా ఉన్న కొండమీదికి పోదు.
ఆరోజు సాయంకాలం అంగడివాడికి మహాదయ కలిగింది. ఒక్కబూందీపూస బీరు వోనియ్యని ఆపిసినిగొట్టు సంవత్సరముబట్టీ వరిష్టపు నూనెతో పరిశిష్టంగా వస్తున్న మిఠాయి జంగిలీ దానిముందర పెట్టాడు. ఆ మిఠాయి మరెవ్వరూ కొనరు. ఎవ్వరూ కొనకపోడం చేత, వారం రోజుల కొకసారి తాజాగా నూనెలో వేస్తున్నా ఎవ్వరూ కొనలేదు. కుక్కమీద మహాదయ పుట్టి ఆజంగలీ దానిముందర పెట్టాడు. అది తిన్నది; ఆప్యాయంగా తిన్నది. ఆరాత్రి కుక్క తెల్లవార్లూ మహా బాధ పడుతున్నట్లుగా ఏడవటం మొదలు పెట్టింది. ఇంట్లో పడుకొన్న స్టేషనుమాస్టరూ, పోర్టర్టూ వేగోలాలు వచ్చినై అనుకొన్నారు. కుక్క పగలు పోయి పొలాలమీద ఆడవులమీద తిరిగి వస్తుంది. 'దాని కేదో మహావాతం పుట్టింది. కనపడ్డ ఆకల్లా కొరికింది. ఏఆకూ పని చెయ్య లేదు• ఒండుమట్టి నాచేత కాదంది. సెలయేటినీళ్ళు ఇది మాపని కాదన్నవి. రాత్రిళ్ళు స్టేషనులో పడి యేడుస్తుంది. మెలికలు తిరిగిపోతుంది, తన నడుము రైలు కింద పడ్డట్టు గోలకెత్తుతుంది. వారమురోజు లీరీతిగా కొట్టుకులాడితే దాని వ్యాధి ఉపశమించింది. రెంరోజు లపవాసం ఉండికూడా వేగోలాన్ని చంపిన యీకుక్క వారము రోజు లయ్యేటప్పటికి చిక్కి శల్యమయింది. దాని వెనుక కాళ్ళూ మొత్తం చప్పబడిపోయినవి. అది యెక్కడో ఒక చోట పడుకొని మూలగడానికి కూడా ఓపిక లేకుండా సన్నగా యేడుస్తు ది. దానికి మిఠాయి అంగడి అంటే భయం వేసింది. అంగడివైవు పోదు' అంగడివంక చూడదు. మునుపు స్టేషనులో యథేచ్ఛంగా తిరిగేది. స్టేషను మాస్టరు గదిలోకి పోయి తొంగి చూస్లే చీడకుక్క, పేలకుక్క అని దాన్ని కొట్టడం మొదలు పెట్టారు.
తరువాత నాల్గునెలలకు ఆపెద్దమనిషి తనరెండు కుక్కపిల్లలలో ఒకటి చచ్చిపోయిన దని చెప్పి రెండవదానిని స్టేషను మాస్టరుగారి కిచ్చాడు. అది ఆరు నెలల్లో యెదిగి తన తండ్రివలె ఐనది. దానికి భయము లేదు. ఎదురుగా నున్న కొండమీదికి షికారు పోయివస్తుంది. ఎవరన్నా దానికి మిఠాయి పెట్టబోతారు. అది వాళ్ళకు పళ్ళు చూపించి కరవవస్తుంది. ఎన్ని ఆడ కుక్కలు వచ్చినా వాటివంక చూడదు. అది పిల్ల వేంగోలాలనూ కుందేళ్ళనూ నక్కలనూ వేటాడుతుంది. విద్యార్థులు వచ్చి భూతదయోపన్యాసములు చేస్తూంటే వాళ్ళవంక ఓరగా తిరస్కారముగా చూస్తుంది. ఆపెద్దమనిషి వచ్చి వర్ణవ్యవస్థనుగూర్చి స్టేషముమాస్టరుతో మాట్లాడుతో ఉంటాడు. ఈ కుక్క వస్తే దీనిని ముద్దుగా ముట్టుకోబోతాడు. అది కోవంగా పళ్ళు చూపించి జీర్ణము కాని వేగోలపు మాంసం కక్కిపోతుఁది. రైలు మైలుదూర ముందనగా పోయి ముక్కోళ్ళతో శ్వాస యెగలాగి వసిబట్టి సీదరించుకొని తొలగిపోతుంది.

Comments

Popular posts from this blog

నమ్మకమే.. స్నేహం! | Moral Stories | Telugu Stories @multiplewaystogrow

The Adventures of Sunny and Sparkle | Friendship Stories | Moral Stories @multiplewaystogrow

Amazon is hiring for Associate – Retail Process | Apply Now