ఇంతకీ కుందేలు ఎందుకు రాలేదు....? | Moral Stories | Telugu Stories @multiplewaystogrow
ఇంతకీ కుందేలు ఎందుకు రాలేదు..? రామాపురం ఊరి చివర ఒక పెద్ద అడవి ఉండేది. అందులో క్రూరమైన జంతువులేవీ లేకపోవడంతో.. చిన్నచిన్న జీవులన్నీ ఆనందంగా ఉండేవి. ఆ అడవి పక్కనే చక్కని మంచినీటి కొలను, దాని ఒడ్డునే మర్రి చెట్టు కూడా ఉండేది. ఆ ప్రాంతమంతా చాలా విశాలవంతంగా ఉండటంతో.. అక్కడికి ఆడుకోవడానికి ప్రతిరోజు కుందేలు పిల్ల, జింక పిల్ల, కోతి పిల్ల వచ్చేవి. ఎంచక్కా ఆడుకొని కాసేపు కబుర్లు చెప్పుకొని వెళ్లిపోయేవి. అదే చెట్టు మీద ఒక చిన్న ఉడుత నివసించేది. అది కూడా వీటితో కలిసి ఆడుకునేది. అలా అవి స్నేహంగా ఉంటూ.. ఆనందంగా గడిపేవి. ఎప్పటిలాగే అన్ని జీవులు ఆడుకోవడానికి వచ్చాయి. కానీ.. కుందేలు పిల్ల మాత్రం రాలేదు. దాంతో అన్నీ కంగారుపడ్డాయి. అప్పుడు ఉడుత మిగతా వాటితో.. 'ఈ రోజు కుందేలుకు ఏమై ఉంటుంది. ఎందుకు ఆడుకోవడానికి రాలేకపోయింది. అసలు ఏం జరిగిందో ఏమో?' అని కాస్త దిగులుగా అంది. 'ఎప్పుడూ మన కంటే ముందుగానే.. ఇక్కడికి చేరుకునేది. ఈ రోజు రాలేదంటే కచ్చితంగా ఏదో ముఖ్యమైన పనే ఉండి ఉంటుంది. కాసేపు వేచిచూద్దాం' అని నిదానంగా అంది జింక పిల్ల. అన్నీ జీవులు కుందేలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని దారి వైపే చూస...