Posts

తాతయ్య మెచ్చిన పాటలు (కథ) | Moral Stories In Telugu | Story Telling Telugu @multiplewaystogrow

Image
  తాతయ్య మెచ్చిన పాటలు (కథ):        "హరిణీ! ఆ గోల ఏంటి? చిరాకు వస్తుంది. కొంచెం ఆపుతావా?" కోపంగా అన్నాడు తాతయ్య రామయ్య.. "నా పాట గోలగా ఉందా? మా పాఠశాలలో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అందరికీ నా పాటలే ఇష్టం. నేను మా పాఠశాలలో నంబర్ వన్ గాయకురాలిని. నన్ను ఇంత అవమానిస్తావా?" అంటూ కోపంగా వెళ్ళిపోయింది హరిణి.         వాళ్ళ ఇంటికి హరిణి వాళ్ళ అమ్మ మాలిని. వాళ్ళ చిన్ననాటి స్నేహితురాలు కమల వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చింది. అతిథి మర్యాదల తర్వాత సరదాగా మాట్లాడుకుంటున్నారు. మాటల సందర్భంలో వాళ్ళ పిల్లల గొప్పతనం గురించి చెప్పుకుంటున్నారు. మాలిని తన కూతురు చాలా బాగా పాడుతుందని, తన కూతురి పాటలను అభిమానించేవారు చాలా మంది ఉన్నారని గొప్పలు చెబుతుంది. "మాకూ ఆ పాటలు వినాలని ఉంది." అన్నది కమల. అమ్మ పిలవగానే వచ్చి హరిణి పాటలు పాడడం మొదలుపెట్టింది. కాసేపు అయ్యాక తాతయ్య "అమ్మా శివానీ జండూ బాం తీసుకుని రామ్మా! నాకు తలనొప్పిగా ఉంది." అని పక్క గదిలోంచి రామయ్య పిలిచాడు. హరిణి చిన్నబుచ్చుకుంది.        అతిథులు వెళ్ళిపోయాక "ఏంటమ్మా! తాతయ్య పద్ధతి నాకు...

గోరొంకగూటికే చేరావే చిలుక | Telugu Kadhalu | Moral Stories In Telugu @multiplewaystogrow

Image
మన Channel కి స్వాగతం   ఈరోజు కధ పేరు గోరొంకగూటికే  చేరావే చిలుక                                    ***** శ్రీలక్ష్మి తల్లి ఒక హైస్కూల్ హెడ్ మాస్టర్ గారింట్లో పనిచేసేది. తనకి ఒక్కతే కూతురు.. పనికి వెళ్ళినప్పుడు కూడా శ్రీలక్ష్మిని తీసుకుని వెళ్ళేది...  ఏడెనిమిదేళ్ళ శ్రీలక్ష్మిని గమనించిన ఆయన, కొంచెం చొరవ తీసుకుని, ఎలిమెంటరీ స్కూల్ లో  ఫీస్ కట్టి స్కూల్ లో చేర్పించారు.. కావలసినవి అన్నీ కొనిపెట్టి, అక్కడ టీచర్ కి కొంచెం కనిపెట్టుకుని ఉండమని కూడా చెప్పారు.. స్వతహాగా తెలివైన శ్రీలక్ష్మి చకచక అంది పుచ్చుకుని, అయిదో క్లాస్ వరకూ చదివేసింది. తరువాత ఆయనకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవడంతో,  తను పనిచేసే హైస్కూల్ లో చేర్పించి, అక్కడున్న స్కీమ్ లో నెలనెలా స్కాలర్షిప్ వచ్చేట్టుచేసి వెళ్లిపోయారు. అలా అందరి సహాయంతో పది పాస్ అయింది. కానీ, తరువాత చదివే చదువు డబ్బుతో కూడుకున్నది కాబట్టి.. ఇక చదివినా వాళ్ళ కులంలో అంత చదువుకున్న వాళ్ళు ఉండరని, పెళ్లికి కష్టమని కూడా శ్రీలక్ష్మి ఇంట్లోవాళ్ళకి...

తోడు | ప్రేమ | Love Stories In Telugu | Moral Stories In Telugu | Telugu Kadalu @multiplewaystogrow

Image
తోడు | ప్రేమ | Love Stories In Telugu | Moral Stories In Telugu | Telugu Kadalu @multiplewaystogrow   మన బ్లాగు కి స్వాగతం  ఈరోజు కధ పేరు తోడు ఉదయం ఏడుగంటలకే స్నానం చేసి దేవుని గదిలో కాసేపు ప్రశాంతంగా కూర్చుని లేచి హాల్ లోకి వచ్చి తన కూతురితో "అమ్మా సుధేష్ణ .  నేను వెళ్ళి రానా" అన్నాడు చిరునవ్వుతో సంగ్రామ్.  "యువార్ లుకింగ్ గుడ్ నాన్నా. ఆల్ ది బెస్ట్. నిన్ననే వెనుక వీధిలో ఉన్న మన ఇంటిని క్లీన్ చేయించి మొత్తం సర్ది పెట్టాను. మీరు పనయ్యాక ఆ ఇంటికే వెళ్ళండి. పనిమనిషి మధ్యాహ్నానికి భోజనం వండి పెడుతుంది." అంది చిరునవ్వుతో. సంగ్రామ్ ఇంటి నుండి బయలుదేరి వీధి మలుపులో ఉన్న మున్సిపల్ పార్క్ లోకి ఎంటర్ అయ్యాడు.  అక్కడ  గ్రీన్ కలర్ సిట్టింగ్ బెంచి పై కూర్చున్న  వర్ధనిని  చూడగానే కళ్ళు ఆనందంతో  అడుగులు పెద్దవయ్యాయి. ఆమెకు దగ్గరగా వెళ్ళే కొద్దీ సంగ్రామ్ గుండె  సడి సంతోషంతో మరింత వేగం పుంజుకున్నట్టు అనిపించింది. వర్ధని పక్కనే కూర్చున్న  సంగ్రామ్ కొడుకు కిషోర్ "సారీ నాన్నా"అన్నాడు తలవంచుకుని. సంగ్రామ్ కిషోర్ భుజాన్ని ఆప్యాయంగా తట్టాడు "థ్యాంక్స్ ...

కరుణాసాగరం-Moral Stories in Telugu-Telugu Stories @multiplewaystogrow

Image
"9 ఏళ్ల వయసున్న చిన్న కుర్రాడు సాగర్. ఆ పసి బాలుడు అమ్మానాన్న ఒక భవంతి దగ్గర ఇటుకలు మోస్తూ, కూలి పని చేసుకుంటున్నారు. సాగర్ కు రోజు మెయిన్ ఉన్రోడ్డు మీద ఉన్న షాపులను చూస్తూ, కాలం గడపడం ఇష్టం .ఆరోజు చాలామంది పిల్లలు స్కూలుకు వెళ్తూ, సరదాగా గంతులు వేస్తూ, చక్కని బట్టలతో నీటిగా వెళ్లడం చూసి, అయ్యో దేవుడా! నాకు కూడా మంచి బట్టలు బూట్లు ఇవ్వలేవా? అంటూ మనసులోనే బాధపడుతూ, మా అమ్మ నాన్న కూలి డబ్బులతో గంజినీళ్లు కూడా ఒక్కొక్క రోజు కరువయ్యేవి, నాకు ఎలా కొంటారు నేను ఎలా చదువుకుంటాను? అన్న మాటలు ఆ పసి మనసులో మెదులుతూ ఉండేవి. ఆ రోజు కూడా రోజు లాగానే ,ఒక 'స్పోర్ట్స్ షాపు ముందు నిలబడి, గాజు అద్దాల,లోంచి లోపలికి చూస్తూ, అక్కడకు వచ్చే తల్లిదండ్రులు తమ పిల్లలకు నచ్చినవి చూపిస్తూ కొనుడం , ఆ పిల్లలు అవి వేసుకుని, షాప్ అంతా సరదాగా పరిగెడుతూ చిందులు వేయడం, చూస్తూ అయ్యో! అమ్మా నాన్న దగ్గర కూడా డబ్బులు ఉంటే, నేను కూడా మంచి బూట్లు కొనుక్కొని, మంచి బట్టలు వేసుకుని చక్కగా స్కూలుకు వెళ్లి చదువుకుంటాను కదా!, అనుకుంటూ అక్కడే పెద్ద 'వెంకటేశ్వర స్వామి' ఫోటోను చూస్తూ ఆ పసి హృదయం బాధపడుతూ ఉండేది. ...

Thank You For Watching.mp4 @multiplewaystogrow

Image
  Thank You For Watching.mp4 @multiplewaystogrow [Verse] Hey there, I see you watchin' me Clickin' on my videos, settin' me free You're my viewers, my loyal crew Each and every one, I'm singin' to you [Chorus] So thank you for watchin', for stickin' around You make my heart soar with every sound I appreciate the likes, the comments, the love Subscribin' to my channel, you're pushin' above (ooh-yeah)

🦜అమ్మ మీద అలక! 🦜- Moral Stories - Telugu Stories @multiplewaystogrow

Image
మన బ్లాగు కి స్వాగతం ఈరోజు కధ పేరు 🦜అమ్మ మీద అలక! 🦜 *చిట్టి* అయిదో తరగతి చదువుతోంది. ఒకరోజు ఉదయాన్నే పుస్తకాల సంచితో బడికి బయలుదేరింది. కానీ బడికి కాకుండా నేరుగా ఊరి పక్కన ఉన్న ఆడవిలోకి వెళ్లింది. అది చిట్టడవి కావడంతో పగటి పూట కూడా కాస్త చీకటిగా ఉంది. కీచురాళ్ల శబ్దం సన్నగా వినిపిస్తోంది. ఒంటరిగా వచ్చిన చిట్టికి భయం వేయసాగింది. 'అనవసరంగా వచ్చానా? ఆవేశంగా బయలుదేరానా?' అని మనసులో అనుకుంటూ ముందుకెళ్లింది. అంతలో అక్కడే ఉన్న జామ చెట్టు పైన వాలిన ఒక చిలుకమ్మ కనబడింది. కానీ, ఆ చిలుక దిగాలుగా ఉన్నట్లు అనిపించింది.  "నీ పేరేంటి? ఎందుకు బాదగా ఉన్నావు?" అని చిట్టి అడిగింది.  "నా పేరు చిన్ని. నన్ను అమ్మ తిట్టింది. అందుకే అమ్మ మీద అలిగి, ఇలా దూరంగా వచ్చేశాను" అని బదులిచ్చింది చిలుక.  చిన్ని చెప్పిన మాటలు విన్న చిట్టి ఆశ్చర్యపోతూ..  "అమ్మ మీద అలకెందుకు?" అని మళ్లీ అడిగింది.  "ఆ ఏముంది? అమ్మకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్లవద్దట. ఎక్కడికైనా వెళితే చీకటి పడకముందే గూటికి చేరుకోవాలట, మిత్రులను పెంచుకో.. శత్రువులను తగ్గించుకోమంటోంది. రెక్కలొచ్చిన పక్షిని నేను. న...

మాక్లీ దుర్గంలో కుక్క | Telugu Stories | Moral Stories in Telugu @multiplewaystogrow

Image
  మాక్లీ దుర్గంలో కుక్క | Telugu Stories | Moral Stories in Telugu @multiplewaystogrow మన బ్లాగు కి స్వాగతం ఈరోజు కధ పేరు మాక్లీ దుర్గంలో కుక్క మనిషి బుద్ధిలోని వక్రతకు అద్దం పట్టిన అద్భుతమైన కథ మాక్లీదుర్గం రైలుస్టేషను గుంతకల్లునుంచి బెంగుళూరు పోయే త్రోవలో నాల్గుస్టేషనుల కివతల నున్నది. ప్లాటుఫారంకన్న రైలుస్టేషను పదిగజాలు ఎక్కి వెళ్ళాలి. రైలురోడ్డుప్రక్కనే పెద్దకొండ ఉన్నది. దానినిండా చెట్లూ చేమలూ, రాళ్ళూ రప్పలూ ఉన్నని. అప్పు డప్పుడు వేగోలాలు సివంగులు రాత్రిళ్ళు స్టేషనులోకి వస్తూ ఉంటివి. స్టేషనుకు వెనుక పెద్దలోయ ఉన్నది. ఆలోయ అంతా సారవంత మైన ప్రదేశం. లోయ కవతలతట్టు ఉన్న కొండమీది ఎవరిదో భాగ్యవంతులది పెద్ద సౌధం ఉన్నది. ఈలో యలో రెండుమూడు వాగులు ఉన్నవి. మాక్లీదుర్గం స్టేషను చాలా చిన్న. అందులో చిన్న అంగడి ఉంది. రైళ్ళు వచ్చేవేళకు ఆ అంగడి తెరిచి ఉంటుంది. ఒకకుక్క అంగడి తెరచి నప్పు డల్లా ఆక్కడ తయారు. అంగడి ఎత్తుగా ఉంటుంది. కుక్క తన చూపు అంగడిలోని పళ్ళికలలో ఉన్న మిఠాయిమీద పడేఅంత సమరేఖలో ఉంచుకొని ఊర్ధ్వదృష్టితో తపస్సు చేస్తుంది. ఎప్పుడైనా, యెవ డైనా కొనుక్కునేటప్పు డైనా చిన్న ముక్క జారి ప...